లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలి: టీఎంసీ కీలక డిమాండ్

by Dishanational2 |
లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలి: టీఎంసీ కీలక డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నందున లోక్ సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ తన పార్టీ ఆఫీసుగా మార్చుకుంటుందని ఆరోపించారు. ప్రజలను నేరుగా ఎదుర్కునే ధైర్యం లేక వక్రమార్గంలో వెళ్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటీని బీజేపీ తమ నియంత్రణలో ఉంచుకుందని మండిపడ్డారు. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో పలువురు ఉన్నతాధికారులను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓబ్రెయిన్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story