లోక్ సభ ఎన్నికల బరిలో లాలూ కుమార్తెలు..!

by Shamantha N |
లోక్ సభ ఎన్నికల బరిలో లాలూ కుమార్తెలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల కోసం ఆర్జేడీ 22 మంది అభ్యర్థులతో కొత్త జాబితా ప్రకటించింది. ఆర్జేడీ విడుదల చేసిన కొత్త జాబితాలో లాలూ కుమార్తెలు మిసా భారతి, రోహిణి ఆచార్య పేర్లు ఉన్నాయి. సరన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి రోహిణి ఆచార్య పోటీ చేయనుంది. పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి మిసా భారతి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఇకపోతే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆర్జేడీ లోక్ సభ బరిలో దిగనుంది.

రోహిణి ఆచార్య తొలిసారిగా ఎన్నికల బరిలో దిగనున్నారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీపై పోటీ చేయనున్నారు. డిసెంబర్ 2022లో లాలూకు కిడ్నీ దానం చేసింది రోహిణి ఆచార్య. మిసాభారతి మాత్రం గతంలో ఆర్జేడీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మిసాభారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగింది. కానీ, జేడీయూ నేత రాం కృపాల్ యాదవ్ చేతిలో రెండు సార్లూ మిసాభారతి ఓటమి పాలైంది.

ఇకపోతే బిహార్ లోని పలు స్థానాలకు ఇండియా కూటమి అభ్యర్థులకు టికెట్లు దక్కాయి. పూర్నియా నుంచి భీమా భారతికి, వైశాలి స్థానం నుంచి విజయ్ కుమార్ శుక్లా ఎన్నికల బరిలో దిగనున్నారు. అరారియా స్థానానికి షానవాజ్ ఆలంకు, శివహార్ నుంచి రీతూ జైస్వాల్ కు టికెట్ దక్కింది.

Next Story