న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

by Dishanational4 |
న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
X

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆయన వయసు 97 సంవత్సరాలు. ఇందిరా గాంధీని పదవి నుంచి తప్పించే కేసులో 1974లో రాజ్ నారాయణ్ తరఫున వాదించిన న్యాయవాది శాంతి భూషణ్. అనేక కారణాలతో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల్లో వాదించారు. అవినీతికి వ్యతిరేకంగా, పౌర హక్కుల కోసం తన గళాన్ని వినిపించిన వ్యక్తి. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో 1977 నుంచి 1979 వరకు ఆయన న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

1980లో ప్రముఖ ఎన్‌జీఓ 'సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్)'ను ఆయన స్థాపించారు. దీంతో అనేక ముఖ్యమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. న్యాయవాదుల్లోనూ జవాబుదారీ తనం ఉండాలన్న ఉద్దేశంతో న్యాయవాది, కార్యకర్త అయిన తన కుమారుడు ప్రశాంత్ భూషణ్‌తో కలిసి 'క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడీషియల్ రిఫార్మ్ (సీజేఏఆర్)' ను ఆయన ప్రారంభించారు. 'మాస్టర్ ఆఫ్ రోస్టర్' సిస్టమ్‌లో మార్పులు కోరుతూ 2018లో శాంతి భూషణ్ పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరించలేదు.


Next Story

Most Viewed