నీట్ అవకతవకలపై వామపక్ష విద్యార్థి సంఘం సమ్మె

by Shamantha N |
నీట్ అవకతవకలపై వామపక్ష విద్యార్థి సంఘం సమ్మె
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ ప్రవేశపరీక్షలో అక్రమాలు, అవకతవకలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నీట్ స్కాంపై వామపక్ష విద్యార్థి సంఘం రెండ్రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. జూన్ 19, 20న రెండు సమ్మె చేపట్టనున్నట్లు ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) తెలిపింది. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎదుర్కొంటున్న అవినీతి, దుర్వినియోగం ఆరోపణలపై మండిపడింది. ఈ అంశంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. నీట్‌ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఎన్‌టీఏ రద్దుపై స్వతంత్రం విచారణ జరపాలని కోరింది. విద్యార్థులంతా ఈ సమ్మెలో పాల్గొనాలని ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. మరోవైపు, నీట్ పరీక్షకు హాజరైన 20 మంది విద్యార్థుల బృందం ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.Next Story

Most Viewed