జాతీయ మహిళా ఛాంపియన్‌తో టేబుల్ టెన్నిస్ ఆడిన న్యాయ మంత్రి (వీడియో)

by Disha Web Desk 12 |
జాతీయ మహిళా ఛాంపియన్‌తో టేబుల్ టెన్నిస్ ఆడిన న్యాయ మంత్రి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. మహిళల సింగిల్స్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీజ అకులతో టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియోకు అతను.. "చాలా కాలం తర్వాత నేను ఆడేందుకు కొంత సమయం తీసుకున్నాను.. భారత మహిళల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శ్రీజను డిఫెండింగ్ చేయగలిగాను". "భారతదేశానికి మరింత కీర్తిని తీసుకురావడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది." అని రిజిజు ట్వీట్ చేశారు. అలాగే శ్రీజ భవిష్యత్తులో తాను అనుకున్నది సాధిస్తుందని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వీరిద్దరి ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story