ప్రధాని మోడీ వ్యాఖ్యలతో ముస్లిం లా బోర్డు అర్ధరాత్రి అత్యవసర సమావేశం

by Mahesh |
ప్రధాని మోడీ వ్యాఖ్యలతో ముస్లిం లా బోర్డు అర్ధరాత్రి అత్యవసర సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం బోపాల్ లో యూనిఫాం సివిల్ కోడ్‌‌ను పెట్టె విదంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముంగిట్లో ప్రధాని నోటి వెంట యూసీసీ మాట వచ్చిన నేపథ్యంలో దేశంలో అత్యున్నత ముస్లిం బాడీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం అయింది. గత అర్థరాత్రి దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో యూసీసీకి సంబంధించిన చట్టపరమైన అంశాలను చర్చించినట్లు తెలిసింది.

అలాగే న్యాయవాదులు, నిపుణులు సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని యూసీసీ విషయంలో లా కమిషన్‌కు తమ అభిప్రాయాలను సమర్పించాలని ముస్లిం సంఘం నిర్ణయించింది. కాగా బీజేపీ మేనిఫెస్టోలోని యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ముస్లిం లా బోర్డు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story

Most Viewed