గత దశాబ్దం ఈశాన్య రాష్ట్రాలకు స్వర్ణయుగం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by Dishanational2 |
గత దశాబ్దం ఈశాన్య రాష్ట్రాలకు స్వర్ణయుగం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని గత పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన ఈశాన్య రాష్ట్రాలకు స్వర్ణయుగంగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. ఈ కాలంలో హింస తగ్గి అనేక వివాదాలు పరిష్కారమయ్యాయని తెలిపారు. షిల్లాంగ్‌లో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్‌ఈసీ) 71వ ప్లీనరీ సెషన్‌ను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. మోడీ హయాంలో ఈశాన్య ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు 71శాతం తగ్గాయని చెప్పారు. 2004-14 వరకు మొత్తం 11,121 హింసాత్మక ఘటనలు జరగగా.. ఇది 2014-23 వరకు 3,114కు తగ్గిందన్నారు. యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్ అనే మూడు మంత్రాలు ప్రస్తుతం అమలవుతున్నాయని తెలిపారు. ‘అటల్ జీ టైంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ సృష్టించబడింది. నేడు మోడీ నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో 8,900 కంటే ఎక్కువ మిలిటెంట్ గ్రూపులు లొంగిపోయాయని.. ఈ క్రమంలోనే తిరుగుబాటు సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. అసోం, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే.. మిగతా ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్సా)ను పూర్తిగా తీసేసినట్టు తెలిపారు.



Next Story

Most Viewed