- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
లాలూ కోసం కిడ్నీ దానానికి సిద్ధమైన కూతురు

న్యూఢిల్లీ: లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి ఆరోగ్యం మెరుగవ్వడం కోసం ఏకంగా తన కిడ్నీని దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ గత నెలలో సింగ పూర్ వెళ్లారు. వైద్యులు తనకు కిడ్నీ మార్చుకోవాలని సూచించారు. దీంతో తన తండ్రి కోసం కిడ్నీ దానం చేసేందుకు కూతురు రోహిణి ఆచార్య ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
దాణా కుంభకోణం కేసులో బెయిల్ పై ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే ఆయనకు కిడ్నీ మార్పిడి ఎప్పుడు జరుగుతుందనే విషయమై ఎలాంటి స్పష్టత లేదు. ఇదే సమయంలో రోహిణి గత నెలలో దీపావళి సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'ఈ దేశానికి మీ ఉనికి అవసరం. దీంతో దేశం నిరంకుశ ఆలోచనలకు వ్యతిరేకంగా పోటీపడగలదు' అని తన తండ్రి లాలూతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. కాగా, ప్రస్తుతం రోహిణి సింగపూర్‌లో ఉంటున్నారు.