Lalu Prasad Yadav : బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు బిగ్ షాక్..

by Disha Web Desk 17 |
Lalu Prasad Yadav : బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు బిగ్ షాక్..
X

పాట్నా: అవినీతి ఆరోపణల కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబానికి చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ‘ఉద్యోగానికి భూమి’ కేసులో లాలూ, రబ్రీదేవి, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో సహా వారి పిల్లల్లో కొందరిపై విచారణ జరుగుతోంది. లాలూ 2004-09 మధ్య కాలంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బీహార్ వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించి వారి భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి.

ఈ కేసులో సీబీఐ కూడా అక్టోబర్‌లో తొలి చార్జిషీట్‌ను, జులై 3వ తేదీన రెండో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. లాలూ ప్రసాద్‌తో పాటు మరో 15 మందిపై గతేడాది మే 18వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలతో పాటు నేరపూరిత కుట్ర, మోసం, ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

Next Story

Most Viewed