భారత చరిత్రలో మొదటిసారి.. పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్

by Mahesh |
భారత చరిత్రలో మొదటిసారి.. పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్ తన జెండరన్ మార్చుకుని లేడీ నుంచి పురుషుడిగా మారాడు. తన జెండర్ తో పాటు పేరును కూడా మార్చాలని.. ఐఆర్ ఆఫీసర్ అయిన అనసూయ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. కాగా కేంద్రం రూల్స్ ను క్షుణ్నంగా పరిశీలించి ఆతని జెండర్ తో పాటు పేరు ను అను కతిర్ సూర్యగా, పురుషుడిగా మారుస్తు ఆమోదం తెలిపింది. దీంతో సివిల్ సర్వీసెస్ చరిత్రలో అధికారికంగా జెండర్ మార్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనసూయ నుంచి అను కతిర్ గా మారిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇలాంటి ఘటనలపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్చయించగా.. జెండర్ ఐడెంటిటీ అనేది వారి వారి వ్యక్తిగతం అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed