వామ్మో.. ఈ కోడి మహా డేంజర్.. ఓనర్ పై కేసు నమోదు

by Disha Web |
వామ్మో.. ఈ కోడి మహా డేంజర్.. ఓనర్ పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడైనా మనుషులపై కుక్కలు దాడిచేస్తే ఫిర్యాదు చేసిన ఘటనలు చూశాం కానీ, కోడిపుంజు దాడి చేస్తే ఫిర్యాదు చేసి ఘటనలు చూడటం చాలా తక్కువ. అయితే ఓ పిల్లాడిపై కోడిపుంజు దాడిచేయడంతో, ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడి పుంజు దాడి చేయడం ఏంటీ అనుకుంటున్నారా..?

వివరాల్లోకి వెళ్లితే.. కేరళలోని ఏర్నాకుళం, మంజుమ్మల్‌‌లోని ముత్తార్ కడవ్‌లో ఓ పిల్లాడిపై కోడి పుంజు దాడి చేసింది. అయితే పిల్లాడిని తీసుకొని, అతని తల్లి పక్కింటికి వెళ్లింది. ఇక ఆ ఇంటి బయట పిల్లాడిని ఉంచి ఇంటిలోపలికి వెళ్లింది. దీంతో పిల్లాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. వచ్చి చూసేసరికి, పిల్లాడిపై కోడి దాడి చేయడంతో, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల కింద, బుగ్గలపై, తల వెనకబాగం బలంగా కోడి పుంజు దాడి చేసింది. దీంతో వెంటనే పిల్లాడి తంల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా, కంటి చూపుపై ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు.

దీంతో కుటుంబ సభ్యులు కోడి పుంజు యజమానిపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని కోడి వలన నా పిల్లాడికి తీవ్రగాయాలు అయ్యాయి అని కేసు పెట్టారు. దీంతో కోడి ఓనర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

Honeypot Ants.. తేనె ఉత్పత్తి చేస్తున్న ఏకైక చీమల జాతి (వీడియో)

Next Story

Most Viewed