దేశంలోనే తొలి ప్రభుత్వ ట్యాక్సీ ప్రారంభించిన Kerala

by Dishanational4 |
దేశంలోనే తొలి ప్రభుత్వ ట్యాక్సీ ప్రారంభించిన Kerala
X

తిరువనంతపురం: ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా కేరళ సవారీ పేరుతో ప్రభుత్వ ట్యాక్సీలను తీసుకొచ్చింది. తాజాగా సీఎం పినరై విజయన్ ఈ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంను అవిష్కరించారు. ప్రయాణికులకు న్యాయమైన, సరసమైన సేవతో పాటు ఆటోలు, ట్యాక్సీ వర్కర్లను ఆమోదయోగ్యమైన జీతం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. కేరళ సవారీ ద్వారా ప్రభుత్వం నిర్ధారించిన ధరల్లోనే సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఇతర ఆన్‌లైన్ ట్యాక్సీలు 20 నుంచి 30 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, కేరళ సవారీ 8శాతమే వసూలు చేయనుంది.

దీనిని తిరిగి పథకాల అమలు, డ్రైవర్లు, ప్రయాణీకులకు ప్రొత్సహాకాలను ఇచ్చేందుకుగానూ ఉపయోగించనున్నారు. మహిళలు ప్రయాణాల్లో భద్రత కోసం ప్యానిక్ బటన్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ప్రమాద విషయం నేరుగా పోలీసు కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉంటుంది. త్వరలోనే జీపీఎస్ ఇన్‌స్టాల్ చేసి, 24 గంటల కాల్ సెంటర్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్‌లోని 321 ఆటోరిక్షాలు, 228 కార్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యాయి. దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేసే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది.


Next Story

Most Viewed