సీఎం విజయన్, కుమార్తెకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..

by Vinod kumar |
సీఎం విజయన్, కుమార్తెకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..
X

తిరువనంతపురం : ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా తైకందియిలిన్‌లకు కేరళ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. లంచం పుచ్చుకోవడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ అంశం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొచ్చి నగరానికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) నుంచి సీఎం విజయన్, ఆయన కుమార్తె వీణ, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితా(, కాంగ్రెస్) సహా పలువురు రాజకీయ నాయకులు లంచాలు పుచ్చుకున్నారని పిటిషనర్ గిరీష్ బాబు ఆరోపించారు.

సీఎం కుమార్తెకు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి రూ.1.72 కోట్ల అక్రమ చెల్లింపు జరిగిందని ఆదాయపు పన్ను శాఖ నివేదికలోనూ ప్రస్తావించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ హైకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉండగా గిరీష్ బాబు చనిపోయినా.. ఇప్పుడు కొనసాగుతున్న న్యాయ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.



Next Story

Most Viewed