కన్నూర్ యూనివర్శిటీ కొత్త వీసీగా బిజోయ్ నందన్

by Prasanna |
కన్నూర్ యూనివర్శిటీ కొత్త వీసీగా బిజోయ్ నందన్
X

తిరవనంతపురం: కన్నూర్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా గోపీనాథ్ రవీంద్రన్‌ను తిరిగి నియమిచడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శుక్రవారం కొత్త వీసీగా ప్రొఫెసర్ ఎస్ బిజోయ్ నందన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నందన్ ప్రస్తుతం కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(సీయూఎస్ఏటీ)లో మెరైన్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బిజోయ్ నందన్‌ను కన్నూర్ యూనివర్శిటీ వీసీగా ఖరారయ్యారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కన్నూర్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అనవసర జోక్యం చేసుకుందని తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయంలో గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడింది. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చిన ఒకరోజులో గవర్నర్ కొత్త వీసీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.



Next Story

Most Viewed