ఢిల్లీని వరదల నుంచి రక్షించడానికి కేజ్రీవాల్ చేసిందేమీ లేదు.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్

by Dishafeatures2 |
ఢిల్లీని వరదల నుంచి రక్షించడానికి కేజ్రీవాల్ చేసిందేమీ లేదు.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీని వరదల నుంచి రక్షించడానికి ఇప్పటివరకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప ఢిల్లీని అభివృద్ధి చేయడం ఆయనకు పట్టదని చెప్పారు. బెంగాల్ లో అంత హింస జరుగుతున్నా కాంగ్రెస్ తో పాటు విపక్షాలకు చెందిన ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని అన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే విపక్షాలు బెంగళూరు వేదికగా సమావేశం నిర్వహించనున్నారే తప్ప మరొకటి కాదన్నారు. విపక్షాల సమావేశంతో ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీలేదని ఆయన అన్నారు.

Next Story

Most Viewed