ఆగిన కేదార్‌నాథ్ యాత్ర.. భక్తులే కారణం..

by Disha Web |
ఆగిన కేదార్‌నాథ్ యాత్ర.. భక్తులే కారణం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ పుణ్యక్షేత్రాల్లో కేదార్‌నాథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి ఏటా లక్షల్లో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి కేదార నాథుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. దేవాలయానికి వచ్చే భక్తుల ఆరోగ్యం పట్ల కూడా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అయితే శనివారం కేదార్‌నాథ్ యాత్రను దేవాలయ యాజమాన్యం నిలిపివేసింది. దాదాపు 30 గంటల పాటు యాత్రను ఆపనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర శనివారం ఉదయం 10 గంటలను సోన్‌ప్రయాగ్‌లో నిలిచింది. అధికారులు భక్తులను అక్కడే ఆపడం జరిగింది. అందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడమే కారణం అని రుద్రప్రయాగ్ సర్కిల్ అధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ యాత్ర ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. అయితే కొన్ని రోజుల క్రితం వాతావరణం కారణంగా, మంచు కురవడం కారణంగా యాత్రను నిలిపారు.

Next Story