ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ కన్నుమూత

by Shamantha N |
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: కేదార్‌నాథ్‌ బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్‌ కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ 68 ఏళ్ల నాయకురాలు గత కొన్నిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా వెంటిలేటర్ సపోర్టుపైనే ఆమెకు డాక్టర్లు వైద్యం అందించారు. శైలారాణి రావత్.. 2012లో కాంగ్రెస్ టికెట్ పై తొలిసారిగా కేదార్ నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారిలో ఆమె కూడా ఉన్నారు. కాగా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ, 2022లో బీజేపీ టికెట్ పై మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.Next Story

Most Viewed