లోక్‌సభలో టీఎంసీ ‘చీఫ్ విప్’గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమతా బెనర్జీ లేఖ!

by Malleboina Mahesh |

లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ విప్‌గా సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ చైర్‌పర్సన్ మమతా బెనర్జీ.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

లోక్‌సభలో టీఎంసీ ‘చీఫ్ విప్’గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమతా బెనర్జీ లేఖ!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ (TMC party) రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ మారగా.. తాజాగా 20 మంది ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తం అయిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC) పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ (Chief Whip) గా సీనియర్ నేత, ఎంపీ కల్యాణ్ బెనర్జీ (MP Kalyan Banerjee)ని నియమించింది. ఈ మేరకు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా ఒక లేఖ రాశారు.

తక్షణమే అమల్లోకి నియామకం

లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని మమతా బెనర్జీ తన లేఖలో స్పీకర్‌కు స్పష్టం చేశారు. ఈ నూతన నియామకానికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటు రికార్డుల్లోకి తీసుకోవాలని, దీనికి సంబంధించి తదుపరి అవసరమైన అధికారిక చర్యలను చేపట్టాల్సిందిగా ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు. రాబోయే పార్లమెంట్ సభలలో పార్టీ ఎంపీలను సమన్వయం చేయడంలో చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ కీలక పాత్ర పోషించనున్నారు. ఇదిలా ఉంటే కల్యాణ్ బెనర్జీని చీఫ్ విప్ గా ప్రకటించడంపై 20 మంది ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారు కూడా స్పీకర్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story