జైలు నుంచి జర్నలిస్ట్ సిద్ధీఖ్ కప్పన్ రిలీజ్

by Disha Web Desk 4 |
జైలు నుంచి జర్నలిస్ట్ సిద్ధీఖ్ కప్పన్ రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దీఖ్ కప్పన్ గురువారం యూపీ జైలు నుంచి విడుదలయ్యారు. 28 నెలల జైలు జీవితం అనంతరం కోర్టు నుంచి ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో బయటి ప్రపంచంలోకి వచ్చారు. 2020 సెప్టెంబర్ 14న ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు అక్టోబ్ 5న సిద్ధీక్ కప్పన్ అక్కడికి బయలుదేరి వెళ్లగా మార్గమధ్యలోనే యూపీ పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

కప్పన్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి బెయిల్ కోసం సిద్ధీఖ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. బెయిల్ కోసం సిద్ధిక్ అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనానికి అప్లై చేసుకున్నాడు. అతడి బెయిల్ పిటిషన్ ను లఖ్‌నవూ బెంచి కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ బెయిల్ లభించడంతో న్యాయపరమైన కార్యకలాపాలు పూర్తి చేసిన తర్వాత కప్పన్‌ను పోలీసులు విడుదల చేశారు.


Next Story

Most Viewed