16మంది అభ్యర్థులను ప్రకటించిన జేడీయూ: పార్టీ మాజీ చీఫ్‌కు చోటు

by Dishanational2 |
16మంది అభ్యర్థులను ప్రకటించిన జేడీయూ: పార్టీ మాజీ చీఫ్‌కు చోటు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని 16లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్న జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) అభ్యర్థులను ప్రకటించింది. అన్ని స్థానాల్లో క్యాండిడేట్స్‌ను ఖరారు చేసింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వశిష్ఠ నారాయణ్ సింగ్ ఈ జాబితాను ప్రకటించారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను జేడీఎస్ తొలగించి ఆ సెగ్మెంట్లలో కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇక, జేడీయూ మాజీ చీఫ్ లలన్‌సింగ్‌ కముంగేర్‌ నుంచి, ఇటీవలే ఆర్జేడీ నుంచి జేడీయూలో చేరిన లవ్లీ ఆనంద్‌ షియోహర్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. అజయ్‌ మండల్‌కు భాగల్‌పూర్‌ నుంచి టిక్కెట్‌ ఇచ్చారు. కాగా, బిహార్‌లో ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), హిందూస్థాన్ ఆవామీ మోర్చా, లోక్ మోర్చా పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఇందులో భాగంగా బీజేపీ 17, జేడీయూ 16, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) 5, జితన్‌రామ్‌ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాకు ఒక్కో సీటు కేటాయించారు. సీట్ల పంకం విషయంలో విభేదాలు రావడంతో కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ రిజైన్ చేసి ఎన్డీయే నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed