- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జమ్మూ-శ్రీనగర్ రహదారి బ్లాక్: పోలీసుల కీలక సూచనలు
దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేగాక కశ్మీర్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఏకైక రహదారి అయిన జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక ప్రదేశాల్లో కొండ చరియలు విరిగిపడ్డట్టు అధికారులు తెలిపారు. దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి బ్లాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ రోడ్డు వెంట వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. సోమవారం నుంచే ఈపరిస్థితి ఉన్నప్పటికీ మూడు రోజులుగా రోడ్డు పునరుద్దరణకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. రోడ్డుపై రాళ్లు అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. బనిహాల్-రాంబన్ సెక్టార్‌లో చిక్కుకుపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి బుధవారం రాత్రి చర్యలు చేపట్టారు. అయితే కిష్త్వారీ ప్రాంతం వద్ద భారీ కొండచరియలు ఉండటంతో ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు పరిస్థితిని తెలుసుకున్నాకే జర్నీ చేయాలని సూచించారు. ఈ మేరకు రోడ్డు పరిస్థితిని తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు స్థితిని తెలుసుకునేందుకు ఆయా నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.
శ్రీనగర్-లడక్ రహదారి మూసివేత
కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ రహదానికి మూసివేసిన అధికారులు భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్-లడఖ్ రహదారి, కుప్వారా, గురేజ్‌లోని నియంత్రణ రేఖతో కలిపే రోడ్లను సైతం క్లోజ్ చేశారు. కిష్త్వారీ పథేర్, బనిహాల్ వద్ద పెద్ద కొండచరియలు విరిగిపడటం, బనిహాల్ మధ్య అనేక ప్రదేశాల్లో అడపాదడపా కాల్పులు జరపడం వల్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేసినట్టు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 44వ నంబర్ జాతీయ రహదారి స్పష్టంగా కపిపించే వరకు ప్రజలు ఈ దారి గుండా వెళ్లొద్దని హెచ్చరించారు. ఇంకా హిమపాతం సంభించే అవకాశం ఉందని ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.