వచ్చే ఎన్నికల్లో మోడీ, కేజ్రీవాల్ మధ్యనే పోటీ: ఎంపీ సంజయ్ సింగ్

by Dishanational4 |
వచ్చే ఎన్నికల్లో మోడీ, కేజ్రీవాల్ మధ్యనే పోటీ: ఎంపీ సంజయ్ సింగ్
X

న్యూఢిల్లీ: 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్యనే పోటీ ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన శుక్రవారం స్పందిస్తూ, 'బీజేపీ నేతలు ఉదయం నుంచీ అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే రానున్న లోక్‌సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఆప్ మధ్యే ఉండనున్నాయని కేంద్రం దేశవ్యాప్తంగా సందేశం పంపింది' అని అన్నారు.

పంజాబ్‌లో ఆప్ ఘన విజయం తర్వాత దేశంలో కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, ఆయన పాలనా విధానంతో ప్రధాని మోడీ, బీజేపీలో భయం పెరిగిపోయిందని, అందుకు సీబీఐ దాడులే నిదర్శనమని తెలిపారు. ఢిల్లీలోని విద్యారంగంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను కీర్తిస్తూ యూఎస్ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో కథనం రావడంతోనే సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేసిందని అన్నారు. ఇలా వరుస పరిణామాలను బట్టి చూస్తే, రానున్న లోక్‌సభ ఎన్నికలు 'బీజేపీ వర్సెస్ ఆప్, మోడీ వర్సెస్ కేజ్రీవాల్'గా ఉండనున్నట్టు రుజువు చేస్తున్నాయని వెల్లడించారు.


Next Story

Most Viewed