కారులో షికారుగా.. రష్యా అధ్యక్షుడు వాహనంలో భారత ప్రధాని చక్కర్లు

by Indraja |
కారులో షికారుగా.. రష్యా అధ్యక్షుడు వాహనంలో భారత ప్రధాని చక్కర్లు
X

దిశ వెబ్ డెస్క్: భారత ప్రధాన మంత్రి మోడీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న శికరాగ్ర సమావేశాలకు ఆయన హాజరైయ్యారు. రష్యా నేలపై అడుగుపెట్టిన మోడీకి రష్యా అధ్యక్షుడు ఘణ స్వాగతం పలికారు. ఇరు దేశాల అధినేతలు కలిసి కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. భారత్ దేశానికి ప్రయాణ, వాణిజ్యపరమైన సౌలభ్యాలను పెపొందిచేలా మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

అయితే ప్రస్తుతం రష్యాలో ఉన్న మోడీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి కారులో కాసేపు ప్రధాని మోదీ షికారు చేశారు. కాగా కారును రష్యా అధ్యక్షుడు పుతిన్ నడపడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను రష్యా అధికారిక మీడియా విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story