రెండు డైవింగ్ సపోర్టు ఓడలను ప్రారంభించిన భారత నేవీ

by Disha Web Desk 21 |
రెండు డైవింగ్ సపోర్టు ఓడలను ప్రారంభించిన భారత నేవీ
X

న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన రెండు అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ వెసెల్స్‌ని (డిఎస్‌వీలు) భారత నేవీ గురువారం ప్రారంభించింది. హిందూ స్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన నిస్టార్, నిపుణ్ ఓడలను ఇండియన్ నేవీ వెల్పేర్ అండ్ వెల్‌నెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అడ్మిరల్ కలా హరి కుమార్ కేరళలోని కోచ్చిలో లాంచ్ చేశారు. అంతకుముందు ఈ ఓడలకు లాంఛనప్రాయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నామకరణం చేశారు. అత్యంత లోతైన సముద్ర జలాల్లో ఆపరేషన్ల కోసం ఈ రెండు ఓడలు ఎంతో ఉపయోగపడతాయని అడ్మిరల్ హరి కుమార్ చెప్పారు.

ఒక్కొక్క ఓడ 118.4 మీటర్ల పొడవు, 22.8 మీటర్ల వెడల్పుతో ఉంటున్నాయి. ఒక్కో ఓడ బరువు 9,350 టన్నులు. దీనిలో ఉండే డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్‌వీ) సముద్రాల లోపల విహరించే జలాంతర్గామి రక్షణ చర్యల్లో పాల్గొంటుంది. అంతేకాకుండా నిరంతర గస్తీ, శోధన-రక్షణ చర్యల్లో పాలు పంచుకోవడమే కాకుండా మహా సముద్రాల్లో హెలికాప్టర్ అపరేషన్లను కూడా నిర్వహిస్తాయని హరి కుమార్ చెప్పారు.

ఈ భారీ ఓడల్లో 80 శాతం వరకు దేశీయంగా రూపొందించిన సామగ్రినే వాడారు. ఇటీవలే కోచిలోని ప్రారంభించిన ఐఎన్ఎస్ విక్రాంత్, నిస్టార్, నిపుణ్‌లు నేవీ నిర్మాతగా భారతీయ నేవీ పురోగతికి సంకేతాలుగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. బహుముఖ కార్యకలాపాలను చేయగలిగిన అతికొద్ది సముద్ర జల శక్తిగా భారత నేవీని ఇవి ముందుపీటిన నిలబెడుతున్నాయని కొనియాడారు. ప్రస్తుతం దేశ రక్షణ అవసరాలకోసం 45 షిప్పులు, సబ్‌మెరీన్లు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 43 దేశవ్యాప్తంగా షిప్‌యార్డులలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు. 2047 నాటికి నూటికి నూరు శాతం స్వావలంబన సాధించే దిశగా భారతీయ నేవీ మరొక ముందడుగు వేసినందుకు గర్విస్తున్నామని అడ్మిరల్ హరికుమార్ చెప్పారు.



Next Story

Most Viewed