భారతీయ స్వరకర్త రికీ కేజ్‌కు 3వ గ్రామీ అవార్డ్..

by Disha Web |
భారతీయ స్వరకర్త రికీ కేజ్‌కు 3వ గ్రామీ అవార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో భారతీయ స్వరకర్త రికీ కేజ్‌ ప్రతీష్ఠాత్మక గ్రామీ అవార్డ్ ను గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన సంగీత స్వరకర్త రికీ కేజ్ 'డివైన్ టైడ్స్' ఆల్బమ్‌కు తన మూడవ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. US సంగీతకారుని ఆల్బమ్‌లో కేజ్‌తో కలిసి పనిచేసిన ప్రముఖ బ్రిటిష్ రాక్ బ్యాండ్ ది పోలీస్ యొక్క డ్రమ్మర్ అయిన స్టీవర్ట్ కోప్‌ల్యాండ్‌తో కేజ్ అవార్డును పంచుకున్నారు. అలాగే వీరు గత సంవత్సరం కూడా ఇదే ఆల్బమ్‌కు ఉత్తమ నూతన వయస్సు ఆల్బమ్ విభాగంలో గ్రామీని గెలుచుకున్నారు. కాగా రికీ కేజ్‌ కు ఇది మూడో గ్రామీ అవార్డ్.. ఆయన ఇంతకు ముందు 2015, 2022 లో కూడా గ్రామీ అవార్డు గెలుచుకున్నాడు.Next Story