పీఓకేలో కాశ్మీరీల ఊచకోతపై స్పందించిన భారత్

by Ajay Maddhiboyina |

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్కోట్‌లో నిరసనకారులపై జరిగిన హింసపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పీఓకేలో పోలీసుల క్రూరత్వం తీవ్రంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

పీఓకేలో కాశ్మీరీల ఊచకోతపై స్పందించిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్కోట్‌లో నిరసనకారులపై జరిగిన హింసపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పీఓకేలో పోలీసుల క్రూరత్వం తీవ్రంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయని అన్నారు. పాక్ చేసిన దుశ్చర్యలకు, దురాగతాలకు అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలబెడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. పీఓకేలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన నుండి ప్రజల దృష్టిని మ‌ళ్లించ‌డానికి పాకిస్థాన్ త‌ప్పుడు వార్త‌లు, త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేస్తోంద‌ని ఆరోపించారు. పాకిస్థాన్ నుండి న‌కిలీ వార్త‌లు, వీడియోలు ఒకే రీతిలో వెలుబ‌డుతున్నాయ‌ని.. దానిని భార‌త్ గ‌మ‌నించింద‌ని అన్నారు.

ఇది త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి చేస్తున్న ఒక నిస్స‌హాయ ప్ర‌య‌త్నం అని అభివ‌ర్ణించారు. ఇదిలా ఉంటే పీవోకేలో జాయింట్ అవామీ యాక్ష‌న్ క‌మిటీకి చెందిన కార్య‌క‌ర్త‌లు త‌మ క‌మిటీని ప్ర‌భుత్వం నిషేదించ‌డంపై ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నిర‌స‌న‌కారులు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య ఉధ్రిక్త‌త చోటు చేసుకుంది. పోలీసులు నిర‌స‌న‌కారుల‌పై దాడులు చేయ‌డంతో 30 మంది మ‌ర‌ణించారు. దాదాపు 200మంది గాయ‌ప‌డ్డారు. అయితే నిర‌స‌న కారులు త‌మ‌పై గెరిల్లా త‌ర‌హా దాడులు చేయ‌డం వ‌ల్లే తాము దాడి తుపాకుల‌కు ప‌ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో పీఓకే మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

Next Story