ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో భారత్‌కు తెలుసు...!

by Disha Web Desk |
ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో భారత్‌కు తెలుసు...!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో భారత్‌కు స్పష్టంగా తెలుసని మరొకరు చెప్పనవసరం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత్ తరుపున ఉన్న శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఐకాసాలో భారత్ తరుపున ఉన్న శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో రుచిరా నెల రోజుల భారతదేశ ప్రణాలికలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో భారతదేశ ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛలపై విలేకర్లు సందించిన ప్రశ్నకు రుచిరా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో భారత్ అత్యంత పురాతన నాగరికత ఉన్న దేశమని అది అందరికీ తెలుసని రుచిరా అన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం వేళ్లు 2,500 ఏళ్ల క్రితమే నాటుకొన్నాయని వ్యాఖ్యానించారు.

మాది ఎప్పుడూ ప్రజాస్వామ్య దేశమే. ఇక ఇటీవల కాలానికొస్తే.. ప్రజాస్వామ్యానికి అవసరమైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, ప్రెస్‌ రూపంలో నాలుగు మూలస్తంభాలు ఉన్నాయని... అత్యంత చురుకైనా సోషల్‌ మీడియా కూడా ఉంది. అందుకే భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతోంది అని రుచిరా కాంబోజ్‌ వివరించారు. 'ప్రతి ఐదేళ్లకోసారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండేలా మా వ్యవస్థ పనిచేస్తుంది. మా దేశంలో వేగంగా సంస్కరణలు చేపడుతూ మార్పులు తీసుకొస్తున్నాం అని రుచిరా వెల్లడించారు. ఈ విషయాన్ని తాను చెప్పాల్సిన అవసరం... మీరు వినాల్సిన అవసరం లేదని రుచిరా వ్యాఖ్యానించారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ నాయకత్వంలో ఐరాస భద్రతా మండలిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెలతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ సమయం ముగియనుంది.


Next Story

Most Viewed