ఉక్రెయిన్‌కు భారత్ ఫిరంగి గుండ్లు.. నిజమేనా ?

by Dishanational4 |
ఉక్రెయిన్‌కు భారత్ ఫిరంగి గుండ్లు.. నిజమేనా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియా, రష్యా ఎంత క్లోజో యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ రెండు దేశాల మధ్య ఉండే సైనిక సహకారం అంతాఇంతా కాదు. చాలా క్లిష్ట సమయాల్లో ఇండియాకు రష్యా రక్షణపరమైన సాయం చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అటువంటిది భారత్ - రష్యా స్నేహాన్ని చెడగొట్టే ఒక దుష్ప్రచారం ఇటీవల జరిగింది. భారత్ నుంచి ఉక్రెయిన్‌కు 155 మిల్లీమీటర్ల ఫిరంగి గుండ్లు సప్లై అయ్యాయంటూ ఇటీవల కొన్ని విదేశీ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిపై తాజాగా గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది.

గత రెండేళ్లుగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం

ఉక్రెయిన్‌కు భారత్ ఫిరంగి గుండ్లు సప్లై చేసిందనే వార్తలన్నీ అవాస్తవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇండియా నుంచి ఒక యూరోపియన్ దేశానికి.. అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు ఫిరంగి గుండ్లు సప్లై అయ్యాయనేది వదంతి మాత్రమేనని తేల్చి చెప్పారు. దాదాపు గత రెండేళ్లుగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ వ్యవహారంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ దేశానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇరుదేశాలూ సంయమనం పాటించాలని పిలుపునిస్తోంది. మిత్రదేశమైన రష్యాకు కోపం రాకుండా భారత్ ఆచితూచి స్పందిస్తోంది. ఈనేపథ్యంలోనే రష్యాతో సంబంధాలను చెడగొట్టేలా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై భారత్ వెంటనే రియాక్ట్ అయింది.



Next Story

Most Viewed