అవసరమైతే బలంగా ప్రతిస్పందిస్తాం : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

by Dishaweb |
అవసరమైతే బలంగా ప్రతిస్పందిస్తాం : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే
X

న్యూఢిల్లీ: భారతదేశం కేవలం నిరోధించడమే కాదు.. అవసరమైతే బలంగా ప్రతిస్పందిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే బుధవారం అన్నారు. బ్రహ్మోస్ యూజర్ మీట్-2023 సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ పాండే మాట్లాడుతూ.. ‘నేడు మన దేశం పరివర్తనలో శిఖరాగ్రంలో ఉంది. అంతర్జాతీయ సమాజంలో దేశం ఎదుగుదలకు మేమే సాక్షులం. మన దేశం నుండి ప్రపంచ సమాజం అంచనాలు అధికంగా ఉన్నాయి. సమకాలీన అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు అన్నీ అభివృద్ధి చెందుతున్న దేశపు నమ్మకమైన ఆశావాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని అన్నారు.

తర్వాత భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పాత్రను ప్రశంసించారు. ఇది భారతదేశం ఫైర్ పవర్‌ను పెంచిందన్నారు. ‘అత్యంత ప్రాణాంతక వైమానిక పోరాటాల ఆస్తులలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి కీలకం. ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు మనల్ని మనం సన్నద్ధం చేసుకునే విధానాన్ని ఇది మెరుగుపరిచింది. రానున్న రోజుల్లో ఈ క్షిపణి కీలకపాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితత్వమైన ఫైర్ పవర్ మనకు చాలా అవసరం. దానిని నిర్లక్ష్యం చేయకూడదు’ అని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed