Tamilnadu: మంత్రి నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు

by srinivas |
Tamilnadu: మంత్రి నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు
X
  • మంత్రి అనుచరుల రాళ్ల దాడితో అధికారులకు సీఆర్ఫీఎఫ్ భద్రత
  • తమిళనాడు రాజకీయాల్లో కలకలం

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ నగరాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలతోపాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ అధికారులు రైయిడ్స్ చేస్తున్నారు. కరూర్ డిప్యూటీ మేయర్ శర్వనంద్ ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. అయితే నిన్న కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేయగా ఐటీ అధికారులపై మంత్రి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఇవాళ రెయిడ్స్ సందర్భంగా అధికారులకు సీఆర్పీఎఫ్ బలగాల భద్రత కల్పించారు. ఈ సోదాలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.



Next Story