Drug Bust In Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.2 వేల కోట్లు అని అంచనా

by Shamantha N |
Drug Bust In Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.2 వేల కోట్లు అని అంచనా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద డ్రగ్స్‌ ముఠా బయటపడింది. ఢిల్లీలో 500 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు సౌత్ ఢిల్లీలో పోలీసులు రైడ్ చేశారు. సోదాల్లో భాగంగా భారీగా డ్రగ్స్ ని పట్టుబట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. అయితే, ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇకపోతే, ఇటీవలే ఢిల్లీలో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ ని సీజ్ చేశారు. ఆ కేసులో ఇద్దరు అఫ్గాన్ జాతీయులను అరెస్టు చేశారు. అయితే, ఆ తర్వాత ఈ వ్యవహారం బయటకొచ్చింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed