గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వడంపై హై కోర్టు కీలక తీర్పు..!

by Anjali |
గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వడంపై హై కోర్టు కీలక తీర్పు..!
X

దిశ, వెబ్‌డెస్క్: గర్భిణులు, బాలింతలకు బెయిల్‌పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్డీపీఎస్ చట్టం కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ ఇలా వ్యాఖ్యానించింది. ‘‘గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిల్, జైల్ కాదు. తల్లి చేసిన నేరం వల్ల పిల్లలను బాధపెట్టకూడదు. జైలులో పుట్టడం వల్ల ఆ పిల్లలపై ప్రతికూలం ప్రభావం ఉంటుంది’’ అని పేర్కొంది. దీంతో తాజాగా హైకోర్టు గర్భిణులకు, బాలింతల జైల్లో ఉన్నప్పుడు తప్పకుండా బెయిల్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed