పేదరికంపై గళం విప్పిన ఆర్ఎస్ఎస్.. దాని ప్రభావమేనన్న కాంగ్రెస్..

by Disha Web |
పేదరికంపై గళం విప్పిన ఆర్ఎస్ఎస్.. దాని ప్రభావమేనన్న కాంగ్రెస్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. పేదరికంపై ఆర్ఎస్ఎస్ గళం విప్పడంతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఎన్నడూ లేని విధంగా పేదరికంపై ఆర్ఎస్ఎస్ మాట్లాడటం 'భారత్ జోడో యాత్ర' ప్రభావమే అని కాంగ్రెస్ నేత అన్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం కారణంగా ఆర్ఎస్ఎస్ కొత్తగా దేశంలోని పేదరికం, నిరుద్యోగం వంటి అంశాలపై మాట్లాడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'భారత్ జోడో యాత్ర ప్రభావం చూడండి. దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తూ, సమాజంలో విషం చిమ్మే వారు కూడా ఈ యాత్ర కారణంగా పేదరికం, నిరుద్యోగం, సమానత్వం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు' అని జైరాం రమేష్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అయితే తాజాగా ఓ సెమినార్‌లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే.. దేశంలోని పేదరికం, ఆర్థిక అసమానత్వం, నిరుద్యోగాలు విసిరే ఛాలెంజ్‌లను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత్ జోడో యాత్ర ప్రభావం కారణంగా ఆయన ఈ సమస్యలను లేవనెత్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అయితే దేశంలోని ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వం అమలు చేసిన తప్పుడు ఆర్థిక పాలసీల కారణంగా ఇప్పుడు మనం ఇలాంటి ఆర్థిక వ్యవస్థతో పోరాడుతున్నామని అన్నారు.

Next Story

Most Viewed