BF-7 వేరియంట్‌పై ఐఎంఏ కీలక సూచనలు

by Nagaya |
BF-7 వేరియంట్‌పై ఐఎంఏ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కొవిడ్ కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న దృష్ట్యా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) హెచ్చరించింది. కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందని... వైరస్ రాకుండా తగిన నియమ నిబంధనలను అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో గత 24 గంటల్లో 145 కొత్త కేసులు నమోదయ్యాయని.. వాటిలో నాలుగు కొత్త చైనా వేరియంట్ - బీఎఫ్7 కేసులు నమోదైనట్లు తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా బీఎఫ్ 7 వేరియంట్ సోకుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ వైద్య రంగంలో బలమైన మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ మద్దతు, తగినంత మందులు, కొవిడ్ టీకాలు అందుబాటులో ఉంచాలంటూ విజ్ఞప్తి చేసింది. అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ వ్యాప్తి విషయంలో సన్నాహక చర్యలు చేపట్టాలని కోరింది. మరోవైపు ఐఎంఏ సభ్యులందరు కూడా పని చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి, పరిస్థితి ఆందోళనకరంగా లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. నివారణ కంటే నిరోధన ఉత్తమం అని పేర్కొంది. బహిరంగ సభలు, సమావేశాలు నివారించాలని హెచ్చరించింది. దీనివల్ల రాబోయే కొవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని పలు కీలక నివారణ మార్గాలను ప్రజలకు సూచించింది.

1. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలి

2. సామాజిక దూరం పాటించాలి

3. సబ్బు , నీరు లేదా శానిటైజర్లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం

4. వివాహాలు, రాజకీయ సామాజిక సమావేశాలు బహిరంగ సభలకు దూరంగా ఉండాలి.

5. అంతర్జాతీయ ప్రయాణాన్ని నివారించండి.

6. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, లూజ్ మోషన్స్ మొదలైన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి

ప్రధాని మోడీ సమీక్ష...

దేశంలో కొవిడ్ పరిస్థితులు, కొత్త వేరియంట్ల కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయిలో వర్చువల్ సమావేశం అయ్యారు. ఈ వర్చువల్ సమావేశంలో కీలక మంత్రిత్వ శాఖల మంత్రులు, కేంద్ర ఆరోగ్య శాఖ, పీఎంఓ అధికారులు పాల్గొన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ల కట్టడి సన్నద్ధత ,రాష్ట్రాలను అప్రమత్తం చేయడం,కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధాని మోడీకి వివరణ ఇచ్చారు.

Next Story

Most Viewed