ఐఐటీ కాన్పూర్: క్లౌడ్ సీడింగ్ ద్వారా కుత్రిమ వర్ష ప్రయోగం విజయవంతం (వీడియో)

by Disha Web Desk 12 |
ఐఐటీ కాన్పూర్:  క్లౌడ్ సీడింగ్ ద్వారా కుత్రిమ వర్ష ప్రయోగం విజయవంతం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఐటీ కాన్పూర్ సెస్నా విమానాన్ని ఉపయోగించి క్లౌడ్ సీడింగ్ కోసం పరీక్షా విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా ఆకాశంలో సుమారు 5000 అడుగుల ఎత్తులో వివిధ రసాయనాల ద్వార కుత్రిమ వర్షానికి సంబంధించిన మేఘాను సృష్టించారు. పరీక్షా విమానం ఆకాశం నుండి కిందకి ల్యాండ్ అయ్యే సమయానికి ఆకాశం నుంచి వర్షం పడటం మొదలైంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో కరువు ప్రాంతాలకు ఈ కుత్రిమ వర్షం వరంలా మారే అవకాశం ఉంది. అలాగే ఈ క్లౌడ్ సీడింగ్ పై మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు.

Next Story