అద్భుతమైన సౌండ్ కోసం ఇండిగోలో ప్రయాణించండి!.. ప్రయాణికుడు చేసిన వీడియో వైరల్

by Ramesh Goud |
అద్భుతమైన సౌండ్ కోసం ఇండిగోలో ప్రయాణించండి!.. ప్రయాణికుడు చేసిన వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గిటార్ నుంచి అద్భుతమైన సౌండ్ విన్న అనుభవాన్ని ఆస్వాదించాలంటే మీరు కూడా ఇండిగోలో ప్రయాణం చేయాలని ఓ మ్యూజిషియన్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ విమాన సంస్థలు తమ లగేజీని డ్యామేజ్ చేస్తున్నాయని ప్రయాణికుల ఫిర్యాదులు చేయడం చూస్తునే ఉన్నాం. కానీ ఎయిర్ లైన్స్ తన గిటార్ నుండి కొత్త మ్యూజిక్ వచ్చేలా చేశాయని ఓ ప్రయాణికుడు వ్యంగ్యంగా చేసిన వీడియో వైరల్ గా మారింది. పీయూష్ కపూర్ అనే మ్యూజిషియన్ ఇటీవలే ఇండిగో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించాడు. అనంతరం ఇండిగో సిబ్బంది ద్వారా తనకు జరిగిన అనుభవాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తను గిటార్ వాయిస్తూ.. ఇంతకు ముందులా కాకుండా మ్యూజిక్ లో కొత్త రకం అనుభవాన్ని చూస్తున్నానని, దీనికి మ్యూజిషియన్లు చాలా కష్టపడుతుంటారు.

కానీ ఒక్క సారి ఇండిగో లేదా మరేదైనా విమానంలో ప్రయాణిస్తే సరిపోతుందని తన పాడైపోయిన గిటార్ ను చూపిస్తూ చమత్కారంగా అన్నాడు. ఎయిర్ లైన్స్ దానిని విచ్చిన్నం చేస్తుందని, దీంతో ఆ మ్యూజిక్ ఎఫెక్ట్ ను ఉచితంగా పొందవచ్చని తెలిపాడు. దీనిపై ఈ అద్భుతమైన ఆవిష్కరణకు ఇండిగోకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఎయిర్ పోర్ట్ లో కూడా ఓ కృతజ్ఞతా పత్రాన్ని సమర్పించానని వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టాడు. అలాగే బ్యాగేజీ హ్యండ్లర్లకు సున్నితమైన వస్తువుల గురించి తెలియజేయాలని ఎయిర్ లైన్స్ కు విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో కపూర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విమాన ప్రయాణాల్లో తమకు జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

Next Story

Most Viewed