భారత్‌పై దాడి చేస్తే తగిన సమాధానం చెప్తాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

by Dishanational2 |
భారత్‌పై దాడి చేస్తే తగిన సమాధానం చెప్తాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సార్వభౌమాధికారంపై ఎవరైనా దాడి చేస్తే దానికి తగిన సమాధానం చెప్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. భారత సాయుధ బలగాలను బలోపేతం చేసేందుకు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. భారత్ పై ఎప్పుడు అటాక్ జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ ఎవరి భూమినీ ఆక్రమించలేదని, కానీ ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ‘2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాం. ఆత్మ నిర్భర్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపట్టి, సైనిక ఆధునీకరణపై దృష్టి పెట్టాం’ అని తెలిపారు. అందువల్ల త్రివిధ దళాలు పూర్తిగా బలోపేతమయ్యాయని స్పష్టం చేశారు. కాగా, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనాతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story

Most Viewed