లోక్ సభ ఎన్నికల్లో వాయుసేనదే కీలకపాత్ర

by Shamantha N |
లోక్ సభ ఎన్నికల్లో వాయుసేనదే కీలకపాత్ర
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో భారత వాయుసేన కీలక పాత్ర పోషించింది. భారీ యంత్రాంగం, కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నికల సంఘం ఎలక్షన్స్ ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఓటరు చెంతకు పోలింగ్ సామగ్రి, సిబ్బంది తీసుకెళ్లేందుకు ఈసీకి వాయుసేన సాయపడింది. తమ హెలికాప్టర్లతో మొత్తంగా వెయ్యి గంటలకుపైగా సార్వత్రిక ఎన్నికల్లో తమ సేవలందించామని వాయుసేన వెల్లడించింది.

వాయుసేన సేవలు

ఎన్నికల సమయంలో తేలికపాటి చేతక్‌, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌, ఎంఐ-17 మీడియం-లిఫ్ట్‌ వంటి హెలికాప్టర్లను విస్తృతంగా వాడినట్లు తేలింది. ఎన్నికల సిబ్బందితోపాటు,ఈవీఎంలు తరలించడంతో కీలకపాత్ర పోషించినట్లు తెలిపింది. మారుమూల ప్రాంతాలు, రోడ్డు మార్గంలో భద్రతా సవాళ్లు ఉన్న ప్రాంతాల్లో సేవలందిచినట్లు తేలింపింది. పోలింగ్ కు ముందు, తర్వాత సిబ్బందిని, సామగ్రిని తరలించడం లాంటి సవాళ్లను ఎదుర్కొన్నామంది. మొత్తంగా తమ హెలికాప్టర్ల ద్వారా 1750 ప్రదేశాల్లో వెయ్యి గంటలకుపైగా సేవలందించామని వాయుసేన తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్రాల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహర్తించామని పేర్కొంది. ఇండియన్‌ ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ హెలికాప్టర్లను కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయని ఓ ప్రకటనలో పేర్కొంది.Next Story

Most Viewed