'నేను మగాడిని.. నా శరీరాన్ని తాకొద్దు'.. టీఎంసీ ఎమ్మెల్యే వినూత్న నిరసన

by Hajipasha |
నేను మగాడిని.. నా శరీరాన్ని తాకొద్దు.. టీఎంసీ ఎమ్మెల్యే వినూత్న నిరసన
X

కోల్‌కతా: రాష్ట్రంలో వరుసగా అధికారి పార్టీ నేతలపై కేంద్ర సంస్థల దర్యాప్తు నేపథ్యంలో టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ వినూత్నంగా నిరసన తెలిపారు. కుర్తా ధరించిన ఆయన తనను ఎవ్వరూ తాకలేరని వ్యంగ్యంగా పేర్కొన్నారు. 'ఈడీ, సీబీఐలు నా శరీరాన్ని తాకలేవు. నేను మగాడిని' అని రాసుకున్నారు. బీజేపీ నేత సువేందు అధికారిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఓ బీజేపీ నేత తనను సీబీఐ, ఈడీలు తాకలేవని ప్రగల్భాలు పలుకుతున్నారని అలీ అన్నారు. కాగా, తాజాగా బీజేపీ చేపట్టిన బెంగాల్ అసెంబ్లీ మార్చిలో సువేంధు అధికారిని మహిళ పోలీసు అధికారి అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. తనను తాకొద్దని, పురుష పోలీసులను రమ్మని సువేందు వారించారు. దీనిపై విమర్శలు చెలరేగగా, ప్రతి మహిళలోనూ తాను దుర్గామాతను చూస్తానని బీజేపీ నేత వివరణ ఇచ్చారు.

Next Story

Most Viewed