నేను మొట్టమొదట రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ చంద్రచూడ్‌

by Disha Web Desk 13 |
నేను మొట్టమొదట రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ చంద్రచూడ్‌
X

న్యూఢిల్లీ : ‘‘నాకు ఇది నచ్చింది.. నేను ఇది చేస్తా అని చెప్పలేను.. భారత ప్రధాన న్యాయమూర్తిగా మొదట నేను చట్టం, రాజ్యాంగ సేవకుడిని. నిర్దేశించిన స్థాయిని నేను అనుసరించాల్సి ఉంటుంది’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్‌ కామెంట్ చేశారు. కొలీజియం వ్యవస్థలో సంస్కరణల అవసరంతో పాటు సీనియర్‌ న్యాయవాది హోదా రద్దు వంటి అంశాలను శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట మాథ్యూస్‌ జే నెడుంపారా అనే న్యాయవాది ప్రస్తావించారు. వీటిపై సీజేఐ స్పందిస్తూ..‘‘మీ మనసుకు నచ్చిన అంశాన్ని చెప్పే స్వేచ్ఛ మీకు ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా నేను నిర్దేశించిన స్థాయిని అనుసరించాల్సి ఉంటుంది.

నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తా అని మీలా చెప్పలేను’’ అని స్పష్టం చేశారు. న్యాయవాదుల్లో కొందరికి సీనియర్‌ న్యాయవాది హోదా ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ లాయర్ మాథ్యూస్‌ జే నెడుంపారా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అడ్వొకేట్స్‌ చట్టం-1961 ప్రకారం సీనియర్‌ న్యాయవాది హోదాకు రాజ్యాంగబద్ధత ఉందని అప్పట్లోనే వెల్లడించింది. సీనియర్‌ న్యాయవాది హోదా అనేది ప్రతిభ ఆధారితమైందేనని ఆనాడు తేల్చి చెప్పింది.Next Story

Most Viewed