అయోధ్యలో భారీ భూ కుంభకోణం..అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
అయోధ్యలో భారీ భూ కుంభకోణం..అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆరోపించారు. బీజేపీ హయాంలో అయోధ్యలోని భూమిని బయటి వ్యక్తులకు విక్రయించారని, వేలకోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మండిపడ్డారు. ఈ భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అయోధ్యలో భూ ఒప్పందాల వల్ల బయటి వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు పత్రికలో వెలువడిన ఓ కథనాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఏడేళ్లుగా సర్కిల్ రేట్లను పెంచడంలో బీజేపీ విఫలమైందని, దీని వల్ల స్థానికులపై తీవ్ర ఆర్థిక భారం పడిందని చెప్పారు. భూ మాఫియా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి లబ్ధిపొందారని, స్థానికులకు, రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. అభివృద్ధి ముసుగులో బీజేపీ భారీ భూ కుంభకోణానికి పాల్పడిందన్నారు. ‘నిరుపేదలు, రైతుల నుంచి భూమిని తక్కువ ధరలకు కొనుగోలు చేయడం ఒక రకమైన భూ ఆక్రమణ. అయోధ్యలో డెవలప్ మెంట్ పేరుతో అనేక స్కామ్‌లు జరిగాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed