బైడెన్, ట్రంప్ మధ్య ‘బిగ్ డిబేట్’

by Shamantha N |
బైడెన్, ట్రంప్ మధ్య ‘బిగ్ డిబేట్’
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. నవంబర్ లో ఎన్నికలు జరగనుండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలిసారి ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు బైడెన్, ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది. ఈ చర్చలో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మరోవైపు, స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు. డిబేట్ లో బైడెన్, ట్రంప్ పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్‌, 78 ఏళ్ల ట్రంప్‌ వయసు కూడా ముఖ్యమైన అంశం.

ఆసక్తికరంగా మారిన డిబేట్

ఇకపోతే, బైడెన్ తన మతిమరుపుని పదేపదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్దినెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. అలాగే పలు సందర్భాల్లో గందరగోళం కనిపించింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా..? అని అంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ట్రంప్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ అంశాలపైనే ట్రంప్ వైఖరిని బైడెన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో వృద్ధ నేతల మద్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ప్పటివరకు అన్ని ఒపీనియన్‌ పోల్‌ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్‌ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర మారవచ్చన్న వాదన వినిపిస్తోంది.Next Story

Most Viewed