వికలాంగులకు బీజేపీ గుడ్ న్యూస్

by Disha Web Desk 12 |
వికలాంగులకు బీజేపీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ సారి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసింది. దీనిని ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో 14 కీలక అంశాలను పొందుపరిచారు. అనంతరం ప్రధాని మోడీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. గడిచిన 10 ఏళ్లలో వికలాంగులకు ఎన్నో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపిన ప్రధాని మోడీ.. వికలాంగులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారికి వసతి కల్పించడానికి ప్రత్యేక కృషి చేస్తామని మోడీ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed