టెర్రర్ ఫండింగ్‌ కేసులో కశ్మీర్ ఉద్యోగులు తొలగింపు

by Disha Web Desk 16 |
టెర్రర్ ఫండింగ్‌ కేసులో కశ్మీర్ ఉద్యోగులు తొలగింపు
X

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం నలుగురు ఉద్యోగులను శనివారం విధుల నుంచి తొలగించింది. జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాది బిట్టా కరాటే భార్య అస్బా అర్జూమండ్ ఖాన్ 2011లో జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (జేకేఏఎస్) అధికారిణి, కశ్మీర్ విశ్వవిద్యాలయంలో సైంటిస్ట్ ముహీత్ అహ్మట్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాజిద్ హుస్సేన్ ఖాద్రీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు అబ్దుల్ ముయీద్‌లు ఉన్నారు. ఈ నలుగురు ఉద్యోగులను ఆర్టికల్ 311 కింద ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఈ నలుగురు ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed