అంబేద్కర్ పోరాటాలు లక్షల మందికి ఆశలు రేపాయి : నరేంద్ర మోడీ

by Disha Web Desk 13 |
అంబేద్కర్ పోరాటాలు లక్షల మందికి ఆశలు రేపాయి : నరేంద్ర మోడీ
X

న్యూఢిల్లీ: అంబేద్కర్ పోరాటాలు లక్షల మందికి ఆశలు రేపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత వర్ధంతి మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మోడీ నివాళులు ఆర్పించారు. 'అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మన దేశానికి ఆయన చేసిన ఆదర్శప్రాయమైన సేవను స్మరించుకుంటున్నాను. అతని పోరాటాలు లక్షలాది మందికి ఆశను కలిగించాయి. భారతదేశానికి ఇంత విస్తృతమైన రాజ్యాంగాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది' అని ట్వీట్ చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు ఆర్పించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.

రాజ్యాంగ ఆదర్శాల అమలులో విఫలం..

అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయవతి మండిపడ్డారు. రాజ్యాంగం ఆదర్శాలను ప్రజల సంక్షేమం కోసం గ్రౌండ్ రియాలిటీ గా మార్చడంలో దేశంలోని ప్రభుత్వాలు వైఫల్యం చెందడం విచారకరం, ఆందోళనకరమని ట్వీట్ చేశారు.. ప్రభుత్వాలు రాజ్యాంగ విధానాలకు అనుగుణంగా నడుచుకుని ఉంటే కోట్ల మంది పేదలు సమస్యల నుంచి స్వేచ్ఛ నుంచి విముక్తి పొందేవారని విమర్శించారు.



Next Story

Most Viewed