హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ముగియనుందా?

by Dishanational6 |
హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ముగియనుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుంది. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ వేసిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు క్రాస్‌ ఓటింగ్‌ వేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఇందర్ దత్ లఖన్‌పాల్, రవి ఠాకూర్, చైతన్య శర్మ, దేవిందర్ కుమార్, రాజీందర్ రాణా, సుధీర్ శర్మపై అనర్హత వేటు పడింది. అనర్హత వేటు పడి ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నారు

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ మాత్రం తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు సమయం పడుతుందని అన్నారు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సంక్షోభం వేళ కాంగ్రెస్ సీనియర్లు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడా, భూపేష్ బఘేల్ పార్టీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. అన్ని విబేధాలు తొలిగిపోయాయని కాంగ్రెస్ సీనియర్లు తెలిపారు. సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే.. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమికి సుఖ్విందర్ సింగ్ బాధ్యత వహిస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మంత్రి పదవికి రాజీనామా చేసి షాక్ ఇచ్చాడు. కాగా.. పార్టీలో తనను పక్కన పెడ్తున్నారని.. అవమానిస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి పదవికి రాజీనామాచేశారు. కానీ ఆయన బీజేపీలో చేరతారనే పుకార్లు రాగా..తన పార్టీ నేతలతో చర్చలు పూర్తయ్యే వరకు రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు.


Next Story

Most Viewed