- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
పీఎఫ్ఐ కేసులో రంగంలోకి అమిత్ షా

దిశ, డైనమిక్ బ్యూరో: పీఎఫ్ఐకి సంబంధించి దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు జరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ మంత్రి గురువారం తన నివాసంలో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎన్ఐఏ డీజీ, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పీఎఫ్ఐకు సంబంధించి దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, వస్తున్న సమాచారం, తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇవాళ ఉదయం నుంచి పీఎఫ్ఐకి చెందిన కార్యాలయాలు, నాయకుల నివాసాలలో ఎన్ఐఏ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పీఎఫ్ఐకి ఉగ్రవాద మూలాల, శిక్షణ వంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున బయటపడటంతో హోమ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ రెయిడ్ లను మొత్తం పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఉన్నత స్థాయి భేటీ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
గురువారం నిర్వహించిన సోదాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ అరెస్టులు జరిగాయి, కేరళలో అత్యధికంగా 22, మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, ఆంధ్రప్రదేశ్ 5, అస్సాం 9, ఢిల్లీ 3, మధ్యప్రదేశ్ 4, పుదుచ్చేరి 3, తమిళనాడు 10, ఉత్తరప్రదేశ్ 8, రాజస్థాన్ 2 లో అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థకు పశ్చిమాసియా దేశాలు, ప్రత్యేకించి ఖతార్, కువైట్ అక్రమంగా నిధులు సమకూరుస్తున్నాయని ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ సూచించింది. అప్పటి నుంచి పీఎఫ్‌ఐ మరియు దాని రాజకీయ విభాగం సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ)పై హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఈ నిధులను దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకే కాకుండా యువతను సమూలంగా మార్చేందుకు కూడా వినియోగిస్తున్నారని గుర్తించింది. ఈ సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్ వంటి పాన్-ఇస్లామిస్ట్ సంస్థతో సంబంధాలను కలిగి ఉండటంతో పాటు భారతదేశాన్ని ఇస్లాం కంట్రిగా మార్చే ప్రణాళికతో పని చేస్తుందనే ఆరోపణలు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం దేశవ్యాప్తంగా జరిగిన సోదాలు ఎన్‌ఐఏ చరిత్రలోనే అతిపెద్ద దర్యాప్తుగా చెబుతున్నారు.