3 దేశాల ఇస్లామిక్ ప్రబోధకుల ఎంట్రీపై బ్యాన్ ?

by Dishanational6 |
3 దేశాల ఇస్లామిక్ ప్రబోధకుల ఎంట్రీపై బ్యాన్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో: తీవ్రవాదం గురించి బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి యూకేకు వస్తున్న తీవ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది బ్రిటన్ ప్రభుత్వం. విదేశాల నుంచే కాకుండా.. బ్రిటన్ లోనూ తీవ్రవాదం పెరగకుండా కొత్త ప్రణాళికలు రూపొందించింది అక్కడి ప్రభుత్వం.

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ దృక్పథాలు కలిగిన మతబోధకులను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. ద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చే బోధకులను బ్రిటన్ లోకి రాకుండా అక్కడి ప్రభుత్వం నిరోధించినట్లు తెలిపింది యూకే మీడియా. 'ది డైలీ టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం.. బ్రిటన్ లో తీవ్రవాద కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు.. అక్కడి ప్రభుత్వం దీనిపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. విదేశాల నుంచి తీవ్రవాదులు రాకుండా.. వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. దీంతో అలాంటి వ్యక్తులను వీసా వార్నింగ్ లిస్ట్ లో చేర్చేందుకు సిద్ధమైంది.

బ్రిటీష్ ప్రధాని మంత్రి రిషి సునాక్ లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ దగ్గర ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. తీవ్రవాదుల వల్ల బ్రిటన్ లో ప్రజాస్వామ్యం, బహుళ విశ్వాస విలువలకు ముప్పు కలుగుతుందని ఆరోపించారు. దేశంలోకి ప్రవేశించే అతివాదులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామనే గతంలోనే ప్రకటించారు. మరోవైపు వీసాలపై ఉన్నవారు నిరసనలపై ద్వేషాన్ని రెచ్చగొట్టాలని లేదా ప్రజలను భయపెట్టాలని చూస్తే.. వారి వీసాలు రద్దు చేస్తామని స్పష్టం చేసింది బ్రిటన్ హోంశాఖ.

Next Story