- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘హలాల్ సర్టిఫికేషన్’ బ్యాన్‌పై కోర్టుకెళ్తాం: హలాల్ ట్రస్ట్ సీఈఓ
లక్నో: హలాల్ ధ్రువీకరణతో కూడిన ఆహార సరుకుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామని హలాల్ ట్రస్ట్ సీఈఓ నియాజ్ అహ్మద్ ప్రకటించారు. ఆహార ఉత్పత్తులకు హలాల్ ట్యాగ్ వాడటంపై బ్యాన్ విధించడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. హలాల్ ట్యాగ్ అనేది వినియోదారులు, తయారీదారుల ఎంపికకు సంబంధించిన అంశమన్నారు. ఈ అంశం విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులకు ఎలాగైతే వర్తిస్తుందో.. దేశంలో పంపిణీ అయ్యే వస్తువులకూ అలాగే వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఆహార ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్స్ ఇవ్వడంపై బ్యాన్ విధిస్తున్నట్లు యోగి సర్కారు గతవారమే ప్రకటించింది. అయితే హలాల్ సర్టిఫికేషన్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులను మాత్రం మినహాయించింది. ఇప్పుడు ఈ మినహాయింపు అంశం ఆధారంగానే కోర్టుకు వెళ్లేందుకు హలాల్ ట్రస్ట్ రెడీ అవుతోంది.