జ్ఞాన్‌వాపి కేసు.. తీర్పు వాయిదా వేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

by Disha Web Desk 21 |
జ్ఞాన్‌వాపి కేసు.. తీర్పు వాయిదా వేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
X

వారణాసి: ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పట్టణంలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో కనుగొన్న శివలింగానికి పూజలు నిర్వహించడానికి అనుమతించాలన్ని పిటిషన్లపై తుది తీర్పును ఫాస్ట్ ట్రాక్ కోర్టు నవంబర్ 17కి వాయిదా వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని సివిల్ జడ్జి మహేంద్ర పాండే ఈ కేసులో తీర్పును గురువారానికి వాయిదా వేశారని అసిస్టెండ్ జిల్లా ప్రభుత్వ కౌన్సిల్ సులభ్ ప్రకాష్ పేర్కొన్నారు. తీవ్ర వివాదాస్పదంగా మారిన జ్ఞాన్‌వాపి కేసులో ఇరుపక్షాల వాదనను విన్న కోర్టు అక్టోబర్ 27న తన తీర్పును నవంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

అయితే నవంబర్ 8న న్యాయమూర్తి లీవులో ఉన్న కారణంగా దాన్ని 14కి వాయిదా వేశారు. తీర్పు ప్రకటన మళ్లీ నవంబర్ 17కి వాయిదా పడినట్లు ప్రభుత్వ కౌన్సిల్ పేర్కొంది. శివలింగం బయటపడ్డ జ్ఞాన్ వాపి ఆవరణలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించి సనాతన్ సంఘ్‌కి అప్పగించాలని, శివలింగానికి పూజలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ మే 24న విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ సింగ్ వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 25న జిల్లా జడ్జి ఏకే వెంకేషన్ ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ ముగిసి రీజర్వులో ఉన్న తీర్పు వివరాల కోసం అత్యంత ఉత్కంఠతో ఇరు పక్షాలూ (అంజుమన్ ఇంతెజిమియా కమీటీ, విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్) ఎదురుచూస్తున్నాయి.



Next Story

Most Viewed